రేసు రాములు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

Oct 17, 2024 - 19:25
Oct 17, 2024 - 19:37
 0  1
రేసు రాములు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

రేసు రాములు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి:-సూర్యాపేట కుడ కుడ రోడ్డు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహకారం కుటుంబ సభ్యులకు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్న అసోసియేషన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు రేసు రాములు గౌడ్ కుటుంబానికి సూర్యాపేట కుడ కుడ రోడ్డు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల 4 వేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట కుడ కుడ రోడ్డు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు మహంకాళి ప్రణీత్ మాట్లాడుతూ రేసు రాములు గౌడ్ అకాల మరణం రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కు తీరని లోటు అన్నారు. రాములు గౌడ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అభివృద్ధికి సహకారం అందించటమే కాకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడని తెలిపారు. వారి కుటుంభ సభ్యులతో పాటు అసోసియేషన్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు రాములు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు చిత్తలూరి సతీష్, గోరుగంటి రవీందర్రావు, పులుసు యాదగిరి, పంతంగి దశరథ, పంతంగి శ్రీనివాస్, బండారు మల్లేష్ ,అంబటి నిరంజన్ ఊరశోభన్, కేతం మహేందర్, బొడ్ల రమేష్, కాశి మల్ల అనుదీప్ బండపల్లి శీను, కనకటి మహేష్ చిలివెల్లి సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223