నేడు దూపాడు విద్యుత్ సబ్ స్టేషన్ లో సరఫరా నిలిపివేత
నేడు దూపాడు సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత తెలంగాణ వార్త పెన్ పహాడ్ అక్టోబర్ 17. పెన్ పహాడ్ మండలం దూపాడు విద్యుత్ సబ్ స్టేషన్ నందు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ అధికారి రమేష్ తెలిపారు. 5 మ్ వి ఏ ట్రాన్స్ ఫార్మర్ తో లో వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్నందున అట్టి ట్రాన్స్ఫార్మర్ను తొలగించి. ఎనిమిది ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఇట్టి సబ్ స్టేషన్ కింద ఉన్న దూపాడు లింగాల న్యూ బంజారా హిల్స్. జమ్మలకుంట తండా సీతమ్మ తండా. పెద్ద సీతారాం తండా. చిన్న సీతారాం తండా. చిన్న గార కుంట తండా లకు విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.