ఉన్న వాటికే వసతులు అంతంత మాత్రం  మరో5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తారట

Jul 13, 2024 - 22:46
Jul 13, 2024 - 23:05
 0  4

అయితే పేద వర్గాలకు ఉన్నత విద్య  మరింత దూరమే.

అద్వాన్న స్థితిలో హాస్టళ్ళు,  పైకప్పులు,  కిటికీలు,  బాత్రూం డోర్లు .

నిధులు మంజూరు చేసిన విడుదల చేయని దుస్థితిలో  తెలంగాణ రాష్ట్ర  విశ్వవిద్యాలయాల  గందరగోళం .

---వడ్డేపల్లి మల్లేశం 

పెచ్చుల్లూ డుతున్న పైకప్పులతో  అద్వాన్నంగా హాస్టల్ భవనాలు, తరగతి గదులు,  తలుపులు లేని మరుగుదొడ్లతో,  అద్దాలు పగిలిన కిటికీలకు పరదాలు,  ఊ డిపోయిన సీలింగ్ తో  అంతంత మాత్రమై న  వసతులతో తెలంగాణలో విశ్వవిద్యాలయాలు కునారిల్లు తుంటే  విద్యార్థులు అడిగేవి  గొంతె మ్మ కోరికలు కానేకాదు . మౌలిక సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలని , మురుగునీటి  డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని , అలంకారప్రాయమైన ఫ్యాన్లను  పనిచేసేలా పునరుద్ధరించాలని , తలుపులు లేని మరుగుదొడ్లకు  ఊ డిపోయిన కిటికీలను  మరమ్మత్తు చేయడం ద్వారా రక్షణ కల్పించాలని మాత్రమే కోరుతున్నారు.  పరిశోధన  నూతన పరికల్పనలకు  జీవం పోసుకునే స్థాయి  విద్యను అందించే విశ్వవిద్యాలయాలలో  విద్యార్థులు ఆర్జించే పరిజ్ఞానంతో సమాజంలోని భిన్న సమస్యలకు పరిష్కారాలు వెతకవలసిన తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు  అద్వాన్న స్థితిలోకి నెట్టబడడం విచారకరం.  ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్  ఊడిపడి  విద్యార్థి మీద  పడి  గాయాల పాలైన విషయం మనందరికీ తెలుసు . ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మౌలిక సౌకర్యాలతో పాటు ఫీజు  తక్కువగా  ఉండే అవకాశం వలన పేద విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఇప్పటివరకు ఉండేది. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వం  పరిశోధన  పీహెచ్డీ వంటి కోర్సులకు భారీగా ఫీజులు  పెంచడంతో విద్యా అందకుండా పోతున్నది ఈ తరుణంలో  రాష్ట్రంలో ఉన్నటువంటి 15 విశ్వవిద్యాలయాలు నామ మాత్రంగా మిగిలిపోగా సిబ్బంది కొరత,  నిధుల లేమి వలన,  ఉన్న సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని గడ్డు పరిస్థితులు ఎదురు కావడం రాష్ట్ర ప్రగతికి ప్రతిష్టకు అవమానకరం కాక మరేమిటి? .

అంకెల గారడి లాగా బడ్జెట్లో కేటాయించే నిధులు ఒక రీతిగా   విడుదల అయ్యేవి మొక్కుబడిగా ఉన్న కారణoగా  విశ్వవిద్యాలయాల పరిస్థితి ఆందోళనకరంగా  ఉంటున్నది . 2017 -18 సంవత్సరమునకు  విశ్వవిద్యాలయాలకు 420 కోట్ల రూ. కేటాయిస్తే  విడుదల చేసింది కేవలం 200 కోట్లు మాత్రమే.  2018- 19కి   210 కోట్లు కేటాయిస్తే  విడుదల చేసింది 80 కోట్లు మాత్రమే.  2023 -24 సంవత్సరానికి  కొత్త ప్రభుత్వం 500 కోట్లు కేటాయిస్తే  ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడాన్ని బట్టి  ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి  విశ్వవిద్యాలయాల పట్ల బాధ్యత రాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.  కాకతీయ విశ్వవిద్యాలయంలోని పద్మాక్షి హాస్టల్లో డ్రైనేజీ ,  మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినులు వాపోతుంటే  మరుగుదొడ్ల పక్కన పిచ్చి మొక్కలు  పే రిగి భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తున్నది . ఇక సుమారుగా అన్ని హాస్తల్లలోనూ  నాణ్యతలేని భోజనం సమకూరుస్తున్న కారణంగా ధర్నాలు పి కటింగులు చేసినప్పటికీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకొని కారణంగా  ఉన్నదానితోనే సరి పెట్టుకోవలసి వస్తుంది. ఇక అనేక హాస్టలు తరగతి గదులలో పై పెచ్చులు ఊడిపోతుండడం వలన  ప్రమాదాలు జరుగుతున్నాయి గ్రంథాలయాలు తరగతి గదులు  అరకొర సౌకర్యాలతో  మౌలిక వసతు లు ఫర్నిచర్ లేక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తున్నది.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్ ల నిర్వహణ అధ్వానంగా మారడానికి నిధులు లేమి కారణమని  తెలుస్తుంటే  గతంలో  హాస్టల్ సి లో  ఫ్యాను ఊడిపోయి ఓ విద్యార్థి పై పడి  గాయాల పాలైన విషయం తెలిసిందే . ఇక మూత్రశాలలు మరుగుదొడ్లు  స్నానాల గదులు సరిపోయినన్ని లేకపోవడం,  పరిసరాలు శుభ్రంగా లేక తరగతి గదులు హాస్టల్లోకి పాములు రావడం,  నాసిరకం భోజనం పైన విద్యార్థులు తరచుగా ఆందోళన చేయడం ఇటీవలి కాలంలో పరిశీలించదగ్గ పరిణామాలు.  తెలంగాణ యూనివర్సిటీ నిజాంబాద్ జిల్లాలోని  వసతులను పరిశీలిస్తే  తలుపులు కిటికీలు లేక పెచ్చులూడి కింద పడి గాయాలు కావడం,  సరిపోయినన్ని వసథీ గృహాలు లేక  సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉండడంతో  ఇబ్బంది అవుతున్నట్టుగా తెలుస్తుంది.  అపరిశుభ్రత పెచ్చుమీరి  పరిశుభ్రం చేసే సౌకర్యాలు లేకపోవడం  చిన్న చిన్న మరమ్మత్తులకు కూడా నిధులు లేని కారణంగా  అద్వాన్న స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లుగా  తెలుస్తుంది.అప్పట్లో ou తెలుగుశాఖ అధిపథీ prof  కాశీమ్ గారు   సౌకర్యాలు,నిధులకోసం  నిరసనగా చెట్లకింద తరగతులు నడిపి హెచ్చరిక చేసినా ఫలితం లేకపోవడం విచారకరం.

 ఇంకా ప్రైవేటు వర్సిటీలా?

గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బలవంతంగా  5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రారంభించి ప్రైవేటుకు వత్తాసు పలికి  అదే సందర్భంలో మరో ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆమోదించాలని  గవర్నర్కు పంపిన బిల్లు గతంలో పెండింగ్లో ఉన్నప్పటికీ  ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  గవర్నర్ గారిని కలిసిన సందర్భంగా మరో 5 ప్రైవేటు వర్సిటీలకు కూడా  అనుమతిస్తూ బిల్లును ఆమోదించినట్లుగా తెలుస్తున్నది . ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 15 విశ్వవిద్యాయాలు ప్రభుత్వ రంగంలో అరకొ ర సౌకర్యాలతో పేద వర్గాలకు ఉపయోగపడకపోగా నాసిరకం విద్య భోజనం అందుతూ ఉంటే  వీటిని  అధిక నిధులు మంజూరు చేయడం ద్వారా బలోపేతం చేసే బదులు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రైవేటు వర్సిటీలకు  అవకాశాన్ని ఇవ్వడాన్ని విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, నిరుద్యోగులు , వ్యతిరేకిస్తున్నారు.  ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రారంభించిన ఐది0 టితో పాటు ప్రస్తుతం గవర్నర్ ఆమోదించినటువంటి ఐదు విశ్వవిద్యాలయాలను కూడా ప్రారంభించకుండా  ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలనే  అన్ని సౌకర్యాలు భారీ నిధులను మంజూరు చేయడం ద్వారా పూర్వవైభవాన్ని చేస్తే  పేద వర్గాల తో సహా అందరికీ నాణ్యమైన విద్య  అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని గతంలో ధ్వంసమైన విశ్వవిద్యాలయ విద్యను బలోపేతం చేయడానికి  రాబోయే బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తుందని ఆశిద్దాం!.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333