వెల్దేవి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి

అడ్డగూడూరు16 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు ఆరు కాలాలపాటు పండించిన పంటను దళారుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు.రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వం మద్దతు ధర ప్రతి ఒక క్వింటాకు 2389 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.రైతులు వడ్ల ధాన్యాన్ని మార్కెట్ కు తీసుక వచ్చిన తరువాత సీరియల్ నెంబర్ వేసి కాంటాలు వేయాలని అన్నారు.అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం తడవకుండా చూసుకోవాలని కోరారు. రైతులు తాడి పత్రిలు(పట్టాలు) అందుబాటులో ఉంచుకోవాలని.రైతులనుమోసపూరితమైన ఇబ్బందులు కలవకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చేడే చంద్రయ్య,సీఈఓ వెంకటేశ్వర్లు,వెల్దేవి మార్కెట్ ఇన్చార్జి మిట్టగడుపుల మహేష్,వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి చిన్న సోమయ్య,రాచకొండ శ్రీను,మోత్కూర్ మార్కెట్ మాజీ డైరెక్టర్ బోడ యాదగిరి, వీరస్వామి,నర్సిరెడ్డి,మాజీ ఉపసర్పంచ్ కోటమర్తి జలంధర్,మాజీ వార్డ్ నెంబర్లు చినపాక జగన్,లోడ్ యాదగిరి,సంజీవరెడ్డి,గ్రామ రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.