బావిలో పడి వృద్ధుడు మృతి

అడ్డగూడూరు16 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య తండ్రి చంద్రయ్య జానకిపురం గ్రామం అనే వ్యక్తి కనిపించడం లేదని నిన్నటి రోజు 15--6-2025 బుధవారం రోజున తన కుమారుడి ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేస్ నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసు దర్యాప్తులో ఉండగానే, కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి కట్కూరీ లక్ష్మయ్య 16-6-2025 గురువారం రోజున జానకిపురం గ్రామ శివారులోని బావిలో పడి చనిపోయి కనిపించినాడు.ఇట్టి శవమును దర్యాప్తులో భాగంగా శివపంచనామ నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగినది. శివ పంచనామా అనంతరం దహన సంస్కారాల నిమిత్తం తమ కుటుంబ సభ్యులకు శవమును అప్పగించడం జరిగిందని ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.