అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచార హక్కు చట్టం - 2005

Oct 16, 2025 - 20:08
 0  1
అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచార హక్కు చట్టం - 2005

 చిన్నంబావి మండల అధికారుల నిర్లక్ష్యం వైఖరి

 చిన్నంబావి మండలం 16 అక్టోబర్2025తెలంగాణ వార్త :  చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, కొప్పునూరు గ్రామం నుంచి బదిలీ అయ్యి దాదాపు ఒక సంవత్సరం గడిచింది. అదే విధంగా చిన్నంబావి మండల ఎంపీడీవో రవి నారాయణ కూడా బదిలీ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కొప్పునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో మారని సమాచారం హక్కు చట్టం 2005 బోర్డు. సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అధికారుల్లో మారని తీరు. సమాచార హక్కు చట్టం-2005 పై నిర్లక్ష్యం వహిస్తున్న చిన్నంబావి మండల అధికారులు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం - 2005 వజ్ర ఆయుధంలా పని చేస్తుందని ప్రతి పౌరులు అవినీతి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ విషయాలను తెలుసుకోవడానికి సమాచారకు చట్టాన్ని వినియోగించి సమాచారం తీసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో సమాచార హక్కు చట్టం ప్రజల్లో అవగాహన లేకుండా నీరుగారిపోతుంది. కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మండల స్థాయి అధికారులు మరియు గ్రామస్థాయి అధికారుల పై జిల్లా స్థాయి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల లోనే వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333