ఎల్‌ఓసి అందజేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 

Jun 13, 2024 - 21:25
Jun 13, 2024 - 21:25
 0  11
ఎల్‌ఓసి అందజేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 

అడ్డగూడూరు13 జూన్ 2024తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రానికి చెందిన మంగమ్మగూడెం గ్రామంలో సుస్మిత కి అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెం గ్రామానికి చెందిన చిలుముల సుస్మిత కి సిఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసిని ఎమ్మెల్యే మందుల సామేలు మంజూరు చేయించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుస్మిత భర్త భూపాల్ రెడ్డికి ఎమ్మెల్యే ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అడ్డగూడూరు మాజీ సర్పంచ్ గోలి రాంరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్ తదితరులు అన్నారు.