16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన సన్నాహాక సమావేశం.

Feb 14, 2024 - 20:21
Feb 15, 2024 - 01:28
 0  19
16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన సన్నాహాక సమావేశం.

జోగులాంబ గద్వాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. ఈనెల 16న జరిగే దేశ వ్యాప్త సమ్మెకుసంబందించిన సన్నాహక సమావేశం CiTU కార్యాలయం లో ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు CITU జిల్లా అధ్యక్షా,కార్యదర్శలు వెంకటస్వామి, నరసింహులు, IFTU జిల్లా కోశాధికారి కార్తీక్, AISF జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు హనుమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రం లో BJP ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి ఈ నెల 16 న జరిగే దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంధును అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం కు ధీటైన జవాబు ఇచ్చి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఉన్న 55 కోట్ల కార్మికులు ఓటు ద్వారా BJP ప్రభుత్వం ను ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు, సంపన్నులకోసం పెట్టుబడి దారులకోసం చట్టాలు చేసిన మోడీ ప్రభుత్వం పేదలకోసం ఏమిచేయకుండా gst, కొనుగోలు వ్యాపార,వినియోగదారులపై, నిత్యజీవతావసరం వస్తువుల ధరలు, అయిల్ గ్యాస్ బట్టల తదితర అన్నిరకాల ధరలు పెంచి సామాన్యులను లూటి చేస్తూ దోచుకోవడం నేడు కనీవిని ఎరగానంత చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు అందుకే గుళ్ళు గోపురాలు చర్చిలు, దేశాల పేరుమీద ఓట్లకోసం డ్రామాలాడుతున్న మోడీ బీజేపీ ని గద్దె దించి సామాన్యులకు పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333