సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధిత కుటుంబానికి అందజేత ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు

Dec 22, 2024 - 19:30
Dec 23, 2024 - 18:10
 0  22
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధిత కుటుంబానికి అందజేత ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను బాధిత కుటుంబానికి అందజేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన గుగులోతు లలిత కుటుంబానికి రూ.61,000 వేల సీఎంఆర్‌ఎఫ్‌ సహాయాన్ని స్వయంగా అందించారు. లలిత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందుల వలన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారి రిఫరెన్స్ లెటర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కును శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు వారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరి గోపాలరావు, వెచ్చ శ్యామ్, పెంటేల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State