విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలంగాణ వార్త పెన్ పహాడ్ ఫిబ్రవరి 22 విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశలో ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు పటిష్టంగా పని పనిచేయడం హర్షించదగిన విషయమని మోడల్ స్కూల్ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ అన్నారు, శనివారం పెన్ పహాడ్ మండలం అనాజిపురం మోడల్ స్కూల్ లో నిర్వహించిన 12వ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు, విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినప్పుడే కన్న తల్లిదండ్రుల జన్మ సార్ధకమవుతుందన్నారు, ఉపాధ్యాయుల బోధనలను విద్యార్థులు సరైన రీతితో అర్థం చేసుకున్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఆస్కారం ఉంటుందన్నారు. పదవ తరగతి.ఇంటర్మీడియట్ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉపాధ్యాయులకు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. మండల నోడల్ఆఫీసర్డి వస్రా0నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన. వివిధ క్రీడలలో గెలుపొందిన విజేతలకు. ర్యాంకులు సాధించిన వారికి. దుర్గాప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను మెమొంటో శాలువాలతో ఉపాధ్యాయ సిబ్బంది సత్కరించారు.విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు పాటలు.డ్యాన్సులు .ఉపన్యాసాలు అందరిని ఆకర్షింప చేశాయి. అనాజిపురం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కోడి లింగయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో.. ఇమాంపేట,గడ్డిపల్లి,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లు లక్ష్మీ ప్రసన్న,బి రమేష్, అనాజిపురం మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కే గురుచరణ్ , ఉపాధ్యాయులు కే సంపత్ కుమార్, వెంకన్న, గుర్రాల సోమయ్య, క్రాంతి కుమార్, సురేష్ గౌడ్, సిహెచ్ వాసు,వీరారెడ్డి, రాజయ్య గౌడ్ల, లక్ష్మీనారాయణ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.