పేషెంట్లను పట్టించుకోని జిల్లా ఆస్పత్రి వైద్య ఆరోగ్యసిబ్బంది
జోగులాంబ గద్వాల ఐదు జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు గత బుధవారం తేదీ 2-07-2025 అందాజా సాయంకాలం ఆరు గంటలకు గర్భిణీ స్త్రీ అయిన పల్లవి W/O నాగేష్ R/Oదౌదర్ పల్లి కాలనీ చెందినవాసిఅను గర్భిణీ స్త్రీ గద్వాలప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు ప్రసవం కొరకు జాయిన్ అయింది. అయితే రెండు రోజుల నుండి ఆసుపత్రుల్లోనే ఉన్న పేషంటుకు నిన్న సాయంత్రం 7:30 గంటలకు ప్రసవ నొప్పులు వచ్చి ఉమ్మనీరు పోతుంటే కూడా పేషెంట్ నిపట్టించుకోవడానికి గైనకాలజిస్ట్ కానీ,డ్యూటీ డాక్టర్ కానీ, సూపర్డెంట్ కానీ ,ఆర్ ఎం ఓ కానీ ఎవరు కూడా డ్యూటీలో లేరు .ఈ పరిస్థితులు ఆమెను కర్నూల్ లేదా మహబూబ్ నగర్ కు రెఫర్ చేస్తామని బాధితులకు వైద్య సిబ్బంది చెప్పారని వారు ఆపోయారు. నిరు పెదలైన మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి వైద్య ఆరోగ్య అధికారులపై కఠిన చర్యలు తీసుకోగలరని జిల్లా కలెక్టర్ ని వారు కోరడమైనది. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి ఇటువంటి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేషెంట్లు కోరుతున్నారు.