విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ కార్మికుడు మృతి

Oct 25, 2025 - 16:41
Oct 25, 2025 - 18:44
 0  678
విద్యుత్  ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ కార్మికుడు మృతి

మోత్కూరు, 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ రిపేరు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ విద్యుత్ కార్మికుడు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.వివరాల్లోకి వెళితే, మోత్కూరు మండల కేంద్రంలో శనివారం ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్ గురై బద్దిపడగా భాస్కర్ రెడ్డి 23(తండ్రి నర్సిరెడ్డి), తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్ ద్వారా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడు ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామానికి చెందినవాడు. భాస్కర్ రెడ్డి గతంలో కూడా ఇక్కడే పని చేసిన అనుభవం ఉంది. తిరిగి గత ఆరు నెలలుగా భాస్కర్ రెడ్డి మోత్కూరులో విధులు నిర్వహిస్తున్నాడు.అతనికి తల్లి, తండ్రి, ఒక తమ్ముడు ఉన్నారు.యువకుడి ఆకస్మిక మరణంతో పారుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు కన్నీటి పర్యంతమయ్యారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి