అలంపూర్ ఆలయాల పట్ల ఆవేదన
ఆలయ ప్రతిష్ట ను కాపాడండి అంటూ కమిషనర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ ని మోరపెట్టుకున్న అలంపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా పేరుగాంచిన శ్రీ జోగులాంబ , బాల బ్రహ్మేశ్వర, నవబ్రహ్మ ఆలయాలు మన నియోజకవర్గానికి ఆధ్యాత్మిక శోభను, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.
ఈ క్షేత్రం రోజురోజుకూ నిండు పున్నమి లా వెలుగొందాలని, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలవాలని ప్రతి భక్తుని ఆశ.
అయితే ఇటీవల ఆలయ పరిపాలన.. టెండర్ల నిర్వహణలో, కూరగాయల సరఫరా అంశంలో చోటుచేసుకున్న పరిణామాలు విచారకరం. అనేక తప్పిదాల కారణంగా కులమత వివాదాల రూపంలో ఆలయాల గౌరవానికి నష్టం కలగడం మా అందరినీ తీవ్రంగా బాధిస్తోంది.
అలంపూర్ జోగులాంబ అనగానే ప్రజల మనసులో ఒక మహిమాన్విత ప్రదేశం, ఆధ్యాత్మికతకు కేంద్రం అనే భావన కలగాలి. కానీ ఇటీవలి పరిస్థితులు ఆ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా... సంబంధిత అధికారి ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి, ఒక వర్గంతో కలిసి ఆలయ ఆవరణలో మీడియా సమావేశాలు పెట్టడం, టెండర్లపై పక్షపాత లేఖలు తీసుకోవడం,....ఉద్యోగులు కూడా వారి ఉద్యోగ నియమావళికి విరుద్ధంగా ఆలయం బయట నిరసనలు చేయడం వంటి ఫోటోలను వారే సామజిక మధ్యమాలో పోస్ట్ చేయడం ఆలయాల పవిత్రత కి, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి.
మేము, అలంపూర్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఈ పరిణామాల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.
ఆలయ గౌరవాన్ని కాపాడే దిశగా, ఈ వివాదాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం.
అలంపూర్ ఆలయాల శోభ తిరిగి చిగురించాలి,
ఆధ్యాత్మిక వాతావరణం పునరుద్ధరించాలి అనేదే
ఇది మా అభ్యర్థన.
*– అలంపూర్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*