రేపాక గ్రామంలో సహాయ చర్యలు అందిస్తున్న పోలీస్ సిబ్బంది
అడ్డగూడూరు 29 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామంలో వరద తాటికి నీట మునిగిన కొన్ని ఇండ్లు,వర్ధ బాధితులను ఇండ్ల నుండి బయటికి తీసుకొస్తున్న పోలీసులు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం పగలు కాబట్టి ఊపిరి పీల్చుకున మామని బాధితులు.. ఇదే రాత్రి సమయంలో అయితే ప్రమాదం ముంచుకొచ్చేదని అన్నారు.డి రేపాక గ్రామానికి కూత వేటు దూరంలో ఉన్న పోతిరెడ్డి కుంట ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి నీటి ప్రభావం తట్టుకోలేక వుప్పొంగడంతో..గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఇండ్లల్లోకి ప్రవహిస్తున్న వరద నీరు..దీంతో హుటాహుటిన గ్రామ పంచాయతీ సిబ్బంది స్పందించి రెండు జెసిబిలను తీసుకొని వచ్చి కూడుకుపోయిన కాలువలను మరమ్మతులు చేస్తున్న పరిస్థితి..గ్రామంలో కొన్ని ఇండ్లు నీటిమునగగా వీధులన్నీ జలమయమైపోయాయి.. ముందస్తు చర్యలో భాగంగా అడ్డగూడూరు పోలీసు ఇతర శాఖల సిబ్బందితో కలిసి గ్రామములో ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.