సంక్షోభంలో సంక్షేమ వసతి గృహం

Aug 16, 2024 - 16:23
Aug 16, 2024 - 16:26
 0  57

జోగులాంబ గద్వాల 16 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణంలో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం. ప్రభుత్వ వసతి గృహాల్లో వసతులు కొరవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.గద్వాల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్‌లో ఇంటర్ నుంచి డిగ్రీ తరగతి వరకు విద్యార్థులు సుమారు 300 మందికి పైగా ఉన్నారు.హాస్టల్ కు కాంపౌండ్ వాల్  పడిపోడంతో రాత్రి సమయంలో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది.కాంపౌండ్ వాల్ లేకపోవడంతో రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఏదైనా విష పురుగులుగాని లోపలికి వెళ్లి కాటు వేయచ్చని విద్యార్థులు భయపడుతున్నారు.గత కొన్ని రోజులుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న ప్రభుత్వం,స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి.ఇలా ఉంటే భద్రత లేనందున మరికొందరు చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.ఏదైనా విద్యార్థులకు ప్రాణాపాయం జరుగముందే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదులు దృష్టి సారించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.హాస్టల్ వార్డెన్ వివరణ కోరడం కోసం కాల్ చేయగా అందుబాటులోకి రాలేదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333