బస్సు ప్రమాదం ...వస్త కొండూర్ గ్రామ వాసి మృతి
గుండాల 24 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్: యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం వస్తకొండూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదంలో గ్రామానికి చెందిన యువతి మహేశ్వరం అనూష రెడ్డి (24) దుర్మరణం పాలయ్యారు.వివరాల ప్రకారం, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనూష రెడ్డి దీపావళి పండుగకు స్వగ్రామం వస్తకొండూర్‌కి వచ్చింది. సెలవులు ముగియడంతో గురువారం రాత్రి ఖైరతాబాద్ వద్ద నుండి కావేరి ట్రావెల్స్ బస్సులో బెంగళూరు బయలుదేరింది. అయితే తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బస్సు ప్రమాదానికి గురవడంతో అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.అనూష తండ్రి శ్రీనివాస్ రెడ్డి రైతు. ఇద్దరు కుమార్తెలలో అనూష చిన్నది. కూతురి అకాల మరణం వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దుఃఖంలో మునిగిపోయారు. వస్తకొండూర్ గ్రామం అంతా విషాదఛాయలు అలముకున్నాయి.....