గద్వాల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు!.
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- పట్టణంలోని జమ్మిచేడు 4వ వార్డు కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలనీలో ఇప్పటికీ మురుగు కాలువ (డ్రైనేజీ) వ్యవస్థ లేకపోవడంతో, ఇండ్ల నుండి వెలువడే వ్యర్థ నీరు, వర్షపు నీరు రోడ్డు మీదకు వచ్చి నిలిచిపోతుందన్నీ ఫలితంగా రోడ్లపై ఎప్పుడూ మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపించడం, వాహనదారులు పలుమార్లు జారి పడడం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్ని “మురుగు కాలువ లేకపోవడంతో నీరు ముందుకు వెళ్లలేక పందులు ఆ నీటిలో ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి. చిన్న పిల్లలు, వృద్ధులు జ్వరాలతో బాధపడుతున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు కూడా రోడ్ల మీద నడవలేక ఇబ్బంది పడుతున్నారు” — అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గతంలోనే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
తాజాగా జమ్మిచేడు 4వ వార్డు కాలని వాసులు గద్వాల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేసి, డ్రైనేజీ (మురుగు కాలువ) నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.