ఇంటర్మీడియట్ ‌జోగులాంబ గద్వాల జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ

Oct 29, 2025 - 18:09
Oct 29, 2025 - 18:10
 0  2
ఇంటర్మీడియట్ ‌జోగులాంబ గద్వాల జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ

అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించాలి

ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ ఎం.హృదయరాజ

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-

ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ గద్వాలను‌ జోగులాంబ ఇంటర్మీడియట్ విద్యాధికారి‌శ్రీ ఎం. హృదయ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందంతో సమావేశం ఏర్పాటు చేసి టీచింగ్ డైరీలు , మార్క్స్ రిజిస్టర్, అధ్యాపకుల హాజ రిజిస్టర్, మరియు విద్యార్థుల రిజిస్టర్లు తనిఖీ చేశారు. అధ్యాపక బృందం అందరూ కూడా సమయపాలన పాటించాలని అధ్యాపకులు విద్యార్థులు FRSలో నమోదు కావాలని ఇంటర్మీడియట్ కమిషనర్ సార్ శ్రీకృష్ణ ఆదిత్య సార్ యొక్క ‌ ఆదేశాలు తప్పక అందరూ పాటించాలని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందాన్ని కోరినారు. పబ్లిక్ పరీక్షలు ఈసారి ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రారంభం అవుతున్నాయి అందువల్ల ప్రతి అధ్యాపకుడు త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని కోరినారు. యూనిట్ టెస్టులు త్రైమాసిక, షాణ్మాసిక పరీక్షలు విద్యార్థులకు నిర్వహించాలని ఆ పరీక్షల ద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి పునశ్చరణ తరగతులు తీసుకోవాలని ఆదేశించారు. చెక్ లిస్టులు అధ్యాపకులు తమ యొక్క తరగతి ఇంచార్జెస్ శ్రద్ధగా వాటిని విద్యార్థుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సబ్జెక్టులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ శ్రీ వీరన్న సార్ మాట్లాడుతూ అత్యధిక హాజరు శాతాన్ని పెంచడానికి ప్రతిరోజు విద్యార్థులకు ఫోన్లు చేయమని ఆధ్యాపక బృందానికి చెప్పామని వారు కూడా ఫోన్ చేస్తున్నారని తెలిపారు.AGMC శ్రీ బండ్ల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి యూనిట్ టెస్ట్ కు ప్రశ్నపత్రము ప్రింట్ చేసి విద్యార్థులకు అందజేస్తున్నామని అందుకు అధ్యాపక బృందం కూడా సహకరిస్తున్నారని విద్యార్థులకు ఈ యొక్క పరీక్షలు చాలా కఠినంగా నిర్వహిస్తున్నామని వెనుకబడిన విద్యార్థులు గుర్తించే వారికి ప్రత్యేకంగా పునరశ్చరణ తరగతులుతీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపినారు. ఈ సమావేశంలో అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State