జిల్లా గ్రంథాలయం చైర్మన్ నిలదీసిన పాఠకులు
జోగులాంబ గద్వాల 4 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను నిలదీసిన పాఠకులు.. జిల్లా గ్రంధాలయం కు మౌలిక వసతులు లేక పాఠకులు నానా అవస్థలు పడుతున్న జిల్లా గ్రంధాల చైర్మన్ ఏమి పట్టించుకోవడంలేదని, ఆయనను పాఠకులు నిలదీశారు .టాయిలెట్స్ లేక అరకొరగా ఉన్న టాయిలెట్స్ లకు నీళ్లు లేక కంపు వాసనకు వెళ్లాలంటే వాంతులకు వస్తాయని చైర్మన్ ను నిలదీశారు. జిల్లా గ్రంధాలయాన్ని కి మౌలిక వసతులపై మీరు ఏం పట్టించుకోవడంలేదని, పేద విద్యార్థులు పై చదువుల కోసం చదువుకోవడానికి జిల్లా గ్రంధాలయానికి వివిధ గ్రామాల నుండి వచ్చి ప్రిపేర్ కావడానికి వచ్చిన పాఠకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పాఠకులు చైర్మన్ ని అడిగారు. చైర్మన్ సరైన సమాధానం చెప్పలేక పాఠకులకు చైర్మన్కు కొద్దిసేపు వాగ్వాదాలు చేసుకున్నారు.