చినుకు పడితే చిత్తడి..
చిన్న వర్షాలకి అధ్వానంగా మారుతున్న రోడ్లు
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- పట్టణంలోని పాలు రోడ్డు చిన్నపాటి వర్షానికి నీరు నిలబడి అధ్వానంగా తయారవుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై చేరి గుంతలుగా మారుతున్నది. ఎంతో అనేకమంది ప్రయాణికులు వాహనాలు క్రిందపడి గాయాల పాలవుతున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో రోడ్డుపై నీరు నిలిచి కంకర తేలి అధ్వానంగా తయారైంది. దీంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రోడ్డుపై నీరు నిలవకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.