వివాహేతర సంబంధం బయట పడుతుందని స్వర్ణలత అనే మహిళ హత్య
జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
కొల్లాపూర్ సిఐ మహేష్
కొల్లాపూర్ మండల ఎస్ఐ రిషికేష్
పెంట్లవెల్లి మండల ఎస్ఐ రామన్ గౌడ్
కొల్లాపూర్,29అక్టోబర్2025తెలంగాణ వార్త
వివాహేతర సంబంధం బయట పడుతుందని ఓ మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి హతమార్చాడు ఓ నిందితుడు. అందుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కొల్లాపూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన స్వర్ణలత (32) 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో వివాహం కాగా.. ఏడేళ్ల క్రితం విడాకులు తీసుకొని టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన బజాజ్ ఫైనాన్స్ లో పనిచేసే విజయ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే విజయ్ కుమార్ మరో అమ్మాయితో మాట్లాడుతున్నట్టు, ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్టు స్వర్ణలతకు తెలిసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అ అమ్మాయిని మర్చిపోయి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే మనం ఇద్దరం దిగిన ఫోటోలు మీ తల్లిదండ్రులకు చూపిస్తానని విజయ్ కుమార్ ను భయభ్రాంతులకు గురిచేసింది స్వర్ణలత. దీంతో ఎలాగైనా స్వర్ణలతను వదిలించుకోవాలనుకున్నాడ అక్టోబర్ 08న నిన్ను కలవాలని మాట్లాడాలని విజయ్ కుమార్ కు కాల్ చేసింది. తన పల్సర్ బైక్ పై స్వర్ణలతను ఎక్కించుకొని పెంట్లవల్లి వెళ్లి అక్కడ కొద్దిసేపు గొడవపడ్డారు. ఇక్కడ అందరూ ఉన్నారు సాకలి రాముని గుట్ట పైకి వెళ్లి మాట్లాడుకుందాం అని అక్కడికి తీసుకువెళ్లాడు. మాట మాట పెరిగి స్వర్ణలత గొంతు నమిలి చంపేశాడు. అనంతరం మంచాలకట్ట గ్రామంలోకి వెళ్లి రెండు బాటిల్ల పెట్రోలు, ఒక సిగరెట్టు, అగ్గిపెట్టె తీసుకొచ్చి ఆమెపై పోసి కాల్చి చంపేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత మంచాలకట్ట గ్రామపంచాయతీ కార్మికుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెంట్లవల్లి ఎస్ఐ రమన్ గౌడ్ ఘటన స్థలానికి వెళ్లి అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతురాలు చనిపోయిన నాలుగు రోజుల కు తన తండ్రి నా కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.