పాలనాధికారులు లేక పడకేసిన పారిశుధ్యం
గద్వాల మున్సిపల్ కార్యాలయా స్పెషల్ ఆఫీసర్ పట్టణంలో పర్యవేక్షణ కరువు.
అంతా మున్సిపల్ కమిషనర్ మాయ.
నిద్ర అవస్థలో గద్వాల పురపాలక శాఖ అధికారులు.
డ్రైనేజీల నుండి పారే మురికి నీళ్లతో దుర్గంధంగా మారిన రాఘవేంద్ర కాలనీ.
జోగులాంబ గద్వాల 5 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. పట్టణం తొమ్మిదవ వార్డు రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజీ నుండి వెలువడే మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి ,ఆ చుట్టుపక్కల ప్రజలు డ్రైనేజీ నుండి వెలువడే మురికి నీళ్ల దుర్గంధపు వాసనకు తట్టుకోలేక దిక్కుతోచని పాట్లు పడుతున్నారు, డ్రైనేజీపై సిసి రోడ్ వేసి డ్రైనేజీనీ మూసివేశారు. మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ కుమ్ముక్కై మామూళ్లకు నోచుకోని డ్రైనేజీని మూసి సీసీ రోడ్డు వేశారు, డ్రైనేజీలో వచ్చే నీరు ఎక్కడ ప్రవహించకుండా అక్కడే నిలుపుదల చేశారు. రోడ్డు తవ్వితే గాని డ్రైనేజీ కాలువ నీరు ప్రవహించవని కాలనీ ప్రజలు అంటున్నారు. కానీ కమిషనర్ మామూళ్ల మత్తులో ప్రజల ఇక్కట్లను చూడడం లేదు. డ్రైనేజీ లో నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి. కాలనీలో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు .కానీ అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉండి పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారం తీయక డ్రైనేజీ కాలువలు నిండి రోడ్లపై పారుతున్న మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న అధికారి కి చీమ కుట్టినట్టైనా లేదు. ఇప్పుడైనా ఫీల్డ్ మీదికి వచ్చి డ్రైనేజీ ని చూసి నీరు ప్రవహించేటట్లు చేస్తారని వీధి ప్రజలు అధికారులకు విన్నవిస్తున్నారు.