మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
జోగులాంబ గద్వాల 28 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పట్టణం లో వడ్డే వీధిలో నివాసం ఉంటున్న వడ్డే వెంకటన్న 60 సంవత్సరాలు, షుగర్ వ్యాధితో ఇతనికి కాలు తీసివేయడం జరిగింది. గతంలో మేస్త్రి గా పనిచేసేవారు. ప్రస్తుతం ఏమి పని చేయలేని స్థితిలో ఉన్న వడ్డే వెంకటన్న కు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు 2 జతల బట్టలు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ బాలచంద్రుడు పాటు వారి సిబ్బంది రమేష్ మరియు 27వ వార్డు కృష్ణ ఉన్నారు