వర్షం కారణంగా రాకపోకలు బంద్..హై లెవెల్ కల్వర్టు బ్రిడ్జిలు లేక ఇబ్బందులు
అడ్డగూడూరు 29 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం అడ్డగూడూరు వెల్దేవి మానాయకుంట గ్రామల మరియు వెల్దేవి అజింపేట గ్రామాల మధ్య గత రెండు మూడు రోజులుగా కురుస్తున వర్షాల కారణంగా రాకపోకలు బందు..దీనికి కరణం కల్వర్టుల వద్ద హైలెవల్ బ్రిడ్జి లేక నిటి ప్రభావం భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే.. నిలిచిపోయిన వాహన దారులు..వర్షాకాలం సీజన్ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు ఎటు చేరుకోవాలన ఈ రెండు కల్వర్టుల వద్ద హై లెవెల్ బ్రిడ్జి లేక ప్రయాణికులు ఎటు పోలేక గ్రామాలలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని మా గ్రామనికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా తక్షణమే హైలెవల్ బ్రిడ్జి పనులు చెప్పటాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.