కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటంను కొనసాగిస్తాం.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంతవరకు
హలో విద్యార్థి- చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం భారీ విజయవంతం మరియు విద్యార్థి గళం పెను ఉప్పెన
BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈరోజు బిఆర్ఎస్వీ రాష్ట్ర పిలుపు మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టిన *హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ ముట్టడి* కార్యక్రమం ను *500 పైగా విద్యార్థులతో గద్వాల కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడి చేయడం జరిగింది.*
*అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది.*
ఈ ముట్టడి కార్యక్రమంనకు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, పార్టీ జిల్లా నాయకులు గంజిపేట రాజు, మైనారిటీ రాష్ట్ర నాయకులు అతికూర్ రహమాన్,అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు ప్రేమలత, కొండాపురం కృష్ణ రెడ్డి హాజరైనారు* మరియు BRSV నాయకులు *రంగస్వామి, కిరణ్, మల్దకల్, సాయన్న, పైపాడు రాజు,బసీర్, వి. రాజు, వీరేష్, ఆఫ్రిద్, రహీమ్, భువన మరియు విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా నాగర్ దొడ్డి వెంకట రాముడుమాట్లాడుతూ..*
* బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రైవేట్ కాలేజీలకు ఇంతవరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది అని అన్నారు.
* విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తానని మోసం.
* విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తానీ మోసం.
* 18 ఏళ్లకు పైబడిన చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని మోసం.
* నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం.
* సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మోసం.
* ఈరోజు రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీ ల యజమాన్యాలు కాలేజీలను మూత చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం రేవంత్ రెడ్డి సర్కార్కు సిగ్గుచేటు అని అన్నారు.
* విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి..
* విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
* కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ పనులు చేసిన తమ మంత్రులకు బిల్లులు క్లియర్ చెసింది కానీ విద్యాసంస్థ యాజమాన్యం లకు మాత్రం ఫీజురీయింబర్స్మెంట్ బిల్లులు క్లియర్ చేయలేకపోయారు..
* ఒక వైపు గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తు మరొ వైపు SC, ST, BC పేద విద్యార్థులకు ఫీజు రియాంబర్స్ మెంట్ ఇయ్యాక దాదాపు 22 నెలలు డిగ్రీ పూర్తి అయినా విద్యార్థులు పై చదులకు పోవడానికి TC లు ఇయ్యకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం చేస్తున్నా రేవంత్ రెడ్డి..
* 22 నెలలు నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి..
* విదేశీ విద్యను అభ్యసిస్తునటువంటి అంబేద్కర్ స్కాలర్ షిప్ SC ST, BC జ్యోతిరావు పూలే స్కాలర్ షిప్, మైనారిటీ సీఎం విద్యార్థులకి గత మూడు సంవత్సరల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు...
* అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను మోసం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం. వారు ఎవరైతే పది పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాస్ అయితే 25000, పిజి పాస్ అయితే లక్ష రూపాయలు, పీహెచ్డీ ఏం ఫీల్ పాస్ అయితే 5 లక్షలు ఇస్తా అని ఇవాళ నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.
* దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి మన రాష్టానికి హోం శాఖ మంత్రిగా కొనసాగడం దురదృష్టకరమైన అన్నారు.
* రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 15 లక్షల విద్యార్థులకు 8000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో పెట్టడం సిగ్గుచేటు. బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి సర్కారు కక్ష సాధించడం దుర్మార్గమని అన్నారు.
* పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసె వరకు బిఆర్ఎస్వీ తరుపున మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు.