నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
కొల్లాపూర్ నియోజక వర్గం 29 అక్టోబర్ 2025:- రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని వివిధ మండలాలు వివిధ గ్రామాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. బుధవారం రోజు కురుస్తున్న భారీ వర్షలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల తో పాటు కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దు అని మరియు విద్యుత్ స్తంభాలను, కరెంట్ తీగలను, ట్రాన్స్ ఫార్మర్లను తాకవద్దుని రోడ్డుపై వెళ్లేటప్పుడు మ్యాన్ హోల్స్, డ్రైనేజీని గమనించి వెళ్లాలని ఉదృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్ళవద్దునీ కూలిపోయే స్థితిలో ఉన్న పాత గోడలను తాకకుండా, పాత ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద నిలబడటం, కూర్చోవడం చేయవద్దునీ వర్షంలో పిల్లలను ఆడుకునేందుకు పంపించొద్దు అనివారన్నారు.