విద్యుత్ లైన్మెన్ సేవలు అమూల్యం
తిరుమలగిరి 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఎవరి స్వంతపనినైనా ఈ రోజుల్లో వర్షం కారణంగా వాయిదా వేసుకునే తరుణంలో తుఫాన్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షం సైతం లెక్కచేయకుండా ప్రజలు చీకట్లో పడుకోకుండా అసలే వర్షాకాలం దోమలు పురుగు పాములు తేళ్లు విశృతంగా తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చీకట్లో పడుకోకూడదు అని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ట్రాన్స్ఫార్మర్ మీద కూర్చుని మరి సేవలందించారు వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని విద్యుత్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వెంకన్న ఎండొచ్చినా వాన పడ్డ అనేటివి లెక్కచేయకుండా గ్రామ సమస్యలపై వెంటనే స్పందిస్తున్న తీరు చాలా బాగుంది సమస్య ఉంది అని తెలియగానే దాని పరిష్కారానికై కృషి చేస్తూ తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నందుకుగాను గ్రామ ప్రజలు మరియు గ్రామ అభ్యుదయ కమిటీ వారిని అభినందించారు. . .