విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ల నిర్లక్ష్యంతో దాసరపల్లి గ్రామంలో జాగరణ
జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం లోని బిజ్వారం సబ్ స్టేషన్ పరిధిలోని దాసరపల్లి గ్రామంలో రాత్రి సమయంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదని ప్రజలు వాపోతున్నారు. ఈరోజు మాత్రం 11గంటలకు 3 ఫేస్ ఆన్ చేసిన 20 నిమిషాలకు కరెంట్ పోయింది అయితే ఎదో మిస్టేక్ అయింది అనుకోని ఒంటి గంట సమయం తర్వాత లైన్మెన్ కు ఫోన్ చేస్తే ఈరోజు డ్యూటీ లో ఉన్న ఆపరేటర్ పేరు చెప్తే ఆయన ఎన్నిసార్లు కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఏఈ కి ఫోన్ చేయడం జరిగింది ఆయన నేను కాల్ చేసి కనుక్కుంటాను ఉండండి అన్నాడు అయితే అదే సమయంలో మా గ్రామం నుండి బిజ్వారం సబ్ స్టేషన్ దగ్గర కు వెళ్లడం జరిగింది
అయితే డ్యూటీలో ఉన్న ఆపరేటర్ ను నిద్ర లేపి ఏమైంది అన్నా మా గ్రామానికి కరెంటు అని అడుగుతే ట్రిప్ అయింటది అన్ని నిర్లక్ష్యంతో సమాధానం చెప్పుకుంటూ వెళ్లి ఆన్ చేయడం జరిగింది. ఇలా మా గ్రామానికి నెల లో 4-5సార్లు జరుగుతుందని చుట్టుపక్కల మా గ్రామానికి తప్ప ఏ గ్రామానికి రాత్రి సమయంలో కరెంటు పోదని దాసరిపల్లి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి తప్పిదాలు మళ్లీ పురాణవృతం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.