అయ్యో పాపం ఆదుకోండి నిరుపేద కుటుంబని..

నాగారం ఫిబ్రవరి 20 తెలంగాణవార్త:- అoధత్వం ఇద్దరు ( అక్క చెల్లెలు) జీవితం పూర్తిగా అంధకారం అవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వారి తీరు ను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఈ దీన గాధ గురించి తెలుసుకోవాలంటే సూర్యాపేట జిల్లా నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలోకి వెళ్లాలి. నాతి రమేష్ -రాణి దంపతులు రెక్కాడితే కానీ డొక్కాడనీ నిరుపేద కుటుంబం, వీరికి సునిత నవ్య ఇద్దరు కూతుళ్లు, నరేష్ కుమారుడు ఉన్నారు. పుట్టుకతోనే సునీత, నవ్య లకు అందత్వం వారి జీవితానికి పెను శాపంగా మారింది. వాళ్ళిద్దరూ ప్రపంచాన్ని చూడలేని దౌర్భాగ్య స్థితి, తండ్రి రమేష్ ఇసుక లారీలకు ఇసుక ఎత్తే కూలి పనులు చేసే క్రమంలో నరాలు సత్తికిలబడిపోయి పక్షవాతం బారిన పడ్డాడు. తల్లి రాణి హైదరాబాదులో ఇరుగు పొరుగు ఇండ్లలో పాచి పనులు (కూలి పనులు)చేసు కుటుంబాన్ని నడిపేది, ఇటీవల కాలం కన్నీరై చేయడంతో, రాణి కడుపులో క్యాన్సర్ కంతి (గడ్డ) ఏర్పడముతో ఆపరేషన్ అత్యవసరమని డాక్టర్లు నిర్ధారణ చేశారు. కుటుంబం గడవడమే అష్ట కష్టంగా ఉన్న తరుణంము లో ఆపరేషన్ అయ్యే ఖర్చు తాను భరించలేనని దిగులుతో రాత్రింపగళ్ళు నిద్రపోకుండా పదేపదే ఆలోచించసాగేది. అనుకోకుండా ఒక రోజు రాత్రి విధి వక్రీకరించడం తో రాణి గుండెపోటు కు గురై మృత్యువాత పడింది. కుటుంబం పెద్దదిక్కు రమేష్ పక్షవాతం కు గురియే అచేతన స్థితిలో ఉండడం, అక్క చెల్లెలు అంధకారము లో ఉండటముతో ఇప్పుడు ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కి వెళ్లిపోయింది.చివరికి తల్లి కి దినకర్మలు చేయలేని స్థితిలో ఉన్నారు. మనసున్న మహారాజులు , పెద్దలు ఈ నిరుపేద కుటుంబానికి సహాయం చేసి ఆపన్న ఆస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాన్నికి సహాయం చేసి అందురాలను ఆదుకోండి..
ఫోన్ pay, gogle pay 6309882351
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ నెంబర్ 41122189684....