సాంకేతికత ముందంజతో సత్వర రుణాలు : ఎస్ .బి .ఐ
సూర్యాపేట 22 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- చిన్న ,మధ్యతర వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు కోసం ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక వెసులుబాటుతో రోజుల తరబడి ఎక్కువ డాక్యుమెంటేషన్ శ్రమ లేకుండా కేవలం కొన్ని ప్రాథమిక పత్రాలతోనే అర్థగంటలో రుణాలు మంజూరు చేయనున్నట్లు ఎస్ .బి .ఐ సూర్యాపేట రీజినల్ మేనేజర్ ఉపేంద్ర భాస్కర్ తెలిపారు
ఆదివారం ఉదయం స్థానిక పాత బస్టాండ్ సమీపాన గల ఎస్ .బి.ఐ బ్రాంచ్ లో జరిగిన వ్యాపార రుణాల అవగాహన సదస్సు (ఎస్.ఎం.ఈ కనెక్ట్) లో ఆయన మాట్లాడారు.
కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎస్. ఎం. ఈ) సురేష్ కుమార్, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మోహన్ కుమార్ గల్లా పలువురు వ్యాపారుల సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు వారి సందేహాలకు సమాధానం చెప్పారు.
సాంకేతిక వినియోగం అందరికీ అర్థమయ్యేలా సమావేశంలో భాగంగానే ఆరుగురి కస్టమర్ల డాక్యుమెంటేషన్ లని వేగవంతమైన సరికొత్త బి.ఆర్.ఇ విధానంలో పరిశీలించి వారికి అక్కడికి అక్కడే లోన్ అప్రూవల్ చేశారు .కొత్తగా వ్యాపారాలు పెట్టే ఉత్సాహవంతులు స్టాండ్ ఆఫ్ ఇండియా, ముద్ర లోన్లని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ వీటితోపాటు సూర్య ఘర్ స్కీమ్, కారు ,గృహ ,వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు తెలిపారు .
కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత విభాగం వారు ,మార్కెట్ కమిషన్ ఏజెంట్లు ,మెడికల్ ఏజెన్సీ సంఘం, బియ్యం వ్యాపారుల సంఘం, ఇతర వ్యాపార ప్రముఖులు మరియు సూర్యాపేటలోని అన్ని బ్రాంచ్ లా చీఫ్ మేనేజర్లు ,బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు