విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి. ఆత్మకూరు ఎస్ విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి చెందిన సంఘటన రామోజీ తండా గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గుగులోతు లచ్చు, భూక్యా రమేష్ చెందిన ఆవులు ఎండాకాలం కావడం తో మేతకు వదలడం జరిగిందనీ గ్రామ శివారు లో వున్న గుగులోతు భోజ్య పొలం లో వున్న సొంత ట్రాన్స్ఫారం క్రిందికి ఉండటం తో విద్యుత్ తీగలు ఆనుకొని పాడి ఆవులు అక్కడికక్కడే మరణించాయని సుమారు 80 వేల వరకు నష్టం జరిగిందని పాడి రైతులు లచ్చు, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు స్పందించి తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.