శివనామస్మరణతో మారుమోగిన గుండెపురి ఆలయం
తిరుమలగిరి 16 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలగిరి మండలంలోని గుండె పూరి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం నందు ఆలయ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ తోటకూరి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోమ కార్యక్రమంలో పలువురు భక్తులు ఘనంగా హోమం కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు స్వామి వారి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది.