ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్ రాంబాబు. ఆత్మకూరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాంటాలను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో వెంట వెంటనే కాంటాలు వేసి లారీలలో బస్తాలను మిల్లులకు తరలించాలని అన్నారు ఈ సందర్భంగా కేంద్రాల్లో పలు రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సీఈవో లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.