అడ్డగూడూరులో (సద్గురు) ఈశా రిజువనేషన్ ట్రోఫీ 2024 క్రీడలు
ఆటలలో పాల్గొన్న మండల మహిళలు
అడ్డగూడూరు 5 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో దక్షిణ భారతదేశంలో జరుగుతున్న గ్రామీణ ఆటల సందర్భంగా ఈశా రెజువనేషన్ 2024 క్రీడలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల మహిళలు త్రో బాల్,ఇతర ఆటలు ఆడటం జరిగింది.ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత కాలానికి మహిళలు,పురుషులు తమ సొంత పనులలో బిజీ జీవితాన్ని గడుపుతూ.. శారీరకంగా,మానసికంగా ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారని క్రీడలో పాల్గొనడం ద్వారా వారికి ఐక్యమత్యం, లీడర్షిప్, మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నారు. వీటి ద్వారా ప్రతి ఒక్కరికి గెలవాలని తాపత్రయం ఉంటుందని ఒకవేళ ఓటమి చెందిన నిరాశ చెందకుండా మరోసారి గెలవడం కోసం ప్రయత్నాలు కొనసాగించడానికి ఉపయోగకరంగా క్రీడలు ఉంటాయని అన్నారు.14 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఈ ఉచిత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని జట్టులోని ఆటగాళ్లందరూ ఒకే గ్రామపంచాయతీకి చెందిన వారై ఉండి ఓకే గ్రామపంచాయతీ నుండి అనేక జట్లు పాల్గొనవచ్చు..సభ్యులందరికీ ఆధార్ కార్డు ఉండాలని తెలిపారు.దీనికి ఆన్లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ WWW.isha.co/gramotsavam-telugu చేసుకోవచ్చని అన్నారు.