ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక - దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా నిర్వహణ

Mar 2, 2026 - 19:32
Mar 2, 2026 - 19:32
 0  1

జోగుళాంబ గద్వాల 2 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్. జిల్లా పోలీసు కార్యాలయంలో దుదిల్ల శ్రీపాదరావు  జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.,  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. 

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ సభాపతిగా శ్రీపాదరావు గారు ప్రజాస్వామ్య పరిరక్షణలో విశేష కృషి చేశారని తెలిపారు. శాసనసభను నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా నడిపిస్తూ అధికార–విపక్షాలకు సమాన అవకాశాలు కల్పించిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. శాసనసభ గౌరవం, నియమావళి పటిష్టతకు ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా ప్రస్తావిస్తూ, సరళ జీవనం మరియు ఉన్నత విలువల రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడని ఎస్పీ  గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజాసేవలో ముందంజలో ఉండాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కట్టుదిట్టంగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె శంకర్, పోలీస్ కార్యాలయ ఏవో సతీష్ కుమార్, గద్వాల్ డి.ఎస్పీ. వై. మొగిలయ్య, ఏ.ఆర్‌. డి.ఎస్పీ.  టి నరేందర్ రావు, ఆర్.ఐ లు నరేష్(అడ్మిన్) , వెంకటేష్ ఎమ్.టి.ఓ., అల్లంపూర్ సర్కిల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. 

.....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333