అగ్రవర్ణ కులాల దాడులకు నిరసనగా ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్ 02 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామానికి చెందిన చిన్నారి మౌనిక అగ్రవర్ణ కులాల దౌర్జన్యానికి బలై ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా"వాణి శ్రీకాంత్ రాజు హాజరై ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ,అగ్రవర్ణ కులాల దౌర్జన్యాలకు బలైన చిన్నారి మౌనికకు తక్షణ న్యాయం చేయాలని,బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. ర్యాలీలో ఫౌండేషన్ రాష్ట్ర నాయకులు,సభ్యులు, కార్యకర్తలు,బహుజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. మౌనిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించడంతో పాటు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.