మార్చి 13న హైదరాబాదులో సామూహిక నిరాహార దీక్షలు జయప్రదం చేయండి
భువనగిరి 02 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలి అధికారంలోకి వచ్చి 27 నెలలైన హామీలను అమలు చేయని ప్రభుత్వంవికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలని,ఎంపిక అయిన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలని,బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ..మార్చి 13 హైదరాబాద్ లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.సి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మనం ఉపేందర్ తెలిపారు.ఈ రోజు భునగిరి టౌన్ సుందరయ్య భవనం కార్యాలయంలో సంఘం విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెళ్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత పాల్గొన్నారు.ఈ సందర్బంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతుంది.అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వికలాంగుల పెన్షన్4016 నుండి 6వేలకు పెంచడంతో పాటు చేయూత పెన్షన్స్ 2016 నుండి 4వేలకు పెంచి,2023 డిసెంబర్ నెల నుండే అమలు చేస్తామని ప్రకటించారు.కానీ 27నెలలు అవుతున్న పెన్షన్ పెంపుకోసం ప్రభుత్వం ఆలోచించకపోవడం అంటే చేయూత లబ్ధిదారులను మోసం చేయడమే అవుతుంది.2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలో 44,49,767 మందికి పెన్షన్స్ వస్తే 2026 జనవరి నాటికి 42,80,129 మందికి పెన్షన్స్ వస్తున్నవి. 27 నెలల కాలంలో రాష్ట్రంలో 1,69,638 మంది పెన్షన్స్ రద్దు చేశారు.పెన్షన్ పెంచకుండా పెన్షన్స్ రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది?2023 అక్టోబర్ నాటికి 5,14,422 మందికి పెన్షన్స్ వస్తే 2026 జనవరి నాటికి 4,84,850 మందికి పెన్షన్స్ వస్తున్నవి.29,572 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దు చేయడం జరిగింది.చేయూత పెన్షన్స్ కోసం ప్రతి నెల 994.50 కోట్లు అవసరం.2024-25 ఆర్థిక సంవత్సరంలో 14628.91 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం 10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసింది.కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు అంటే చేయూత లబ్ధిదారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుంది. 2026-27 వార్షిక బడ్జెట్లో పెన్షన్స్ పెంపుదలకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలి. వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది. 2026-27 బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూ చేసుకుని పెన్షన్స్ కోసం 26 నెలలుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.పెన్షన్స్ పెంచడానికి డబ్బులు లేవని చెపుతున్న ముఖ్యమంత్రి గాంధీ కుటుంబానికి అవసరం అయితే వేయి కోట్లు రాష్ట్రం నుండి ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు.5వేల కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెపుతున్న ముఖ్యమంత్రికి చేయూత పెన్షన్స్ పెంచలనే ఆలోచన ఎందుకు రావడం లేదు.ప్రజాపాలన అంటే ఎన్నికలకు ముందు మాట ఇచ్చి మాట తప్పడమేనా అని ప్రశ్నించారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి సహాయ పరికరాల కోసం 15వేల మంది దరఖాస్తూ చేసుకున్నారు.ఆర్థిక సంవత్సరం ముగిసిన ఎంపిక అయిన లబ్ధిదారులకు పరికరాలు మాత్రం పంపిణి చేయడం లేదు.సహాయ పరికరాల కోసం 50కోట్ల నిధులు విడుదల చేసినమని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం సహాయ పరికరాలు ఎందుకు పంపిణి చేయడం లేదో సమాధానం చెప్పాలి.పరికరాల కోసం ఎంపిక అయిన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వం మాత్రం స్పందించక పోవడం దురదృష్ట కరం.ప్రభుత్వం చెపుతున్న మాటలకూ వాస్తవలకు పొంతన లేకుండా ఉందని అన్నారు.మార్చి 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో పెన్షన్స్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని,బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వంపై ఒత్తిడి పెంచెందుకు మార్చి 13 నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వికలాంగులతో సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.