అంగన్వాడి కేంద్రంలో వీహెచ్ ఎన్ డి ప్రోగ్రాం కి హాజరైన సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి

Mar 2, 2026 - 19:53
Mar 2, 2026 - 21:10
 0  0
అంగన్వాడి కేంద్రంలో వీహెచ్ ఎన్ డి ప్రోగ్రాం కి హాజరైన సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి

చిన్నంబావి 02 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం అంగన్వాడి కేంద్రంలో వీహెచ్ ఎన్ డి కి గ్రామ సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి హాజరు కావడం జరిగినది.  కొత్త వెంకట్ రెడ్డి అంగన్వాడీ కేంద్రంలో 30 నెలల లోపు ఉన్న పిల్లలను బరువు ఎత్తు పరిశీలించి వారికి బాలమృతాన్ని మరియు గుడ్లను అందజేయడం జరిగింది.

 సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి చిన్నారుల తల్లిదండ్రులను ఉద్దేశించి వారికి తగిన విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు చిన్నారులను ఎప్పటికప్పుడు వారి యొక్క కదలికలను పరిశీలిస్తూ ఏదైనా తేడాగా కనిపిస్తే వెంపటే డాక్టర్ ని సంప్రదించండి, చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి, పిల్లల్ని తీసుకుని ఎండల్లో ప్రయాణం చేయకండి, అని చెప్పడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో   సర్పంచ్ తో పాటు గ్రామస్తులు సింగోటం బాలస్వామి,  మార్కం మల్లయ్య, అంగన్వాడి టీచర్, హెల్పర్, అంగన్వాడి చిన్నారులు మరియు తల్లిదండ్రులు హాజరు కావడం జరిగినది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State