సైబర్ నేరాలపై అవగాహన

Feb 28, 2025 - 17:47
Feb 28, 2025 - 19:01
 0  2
సైబర్ నేరాలపై అవగాహన

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్: సైబర్ నేరాలపై అవగాహన. ఆత్మకూర్ ఎస్ సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెడ్ కానిస్టేబుల్ గునుగుంట్ల గురి లింగం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ యాప్ లకు విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు. ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి ఆన్లైన్ వేదికలను దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడే వారికి దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ కిత నరేష్, మహేందర్ మధుసూదన్ రెడ్డి, విద్యార్థులు తదితరులు ఉన్నారు.