నకిరేకల్ అంటే వేముల వీరేశం… వేముల వీరేశం అంటే హోలీ!

Mar 3, 2026 - 17:14
Mar 3, 2026 - 17:16
 0  87
నకిరేకల్ అంటే వేముల వీరేశం… వేముల వీరేశం అంటే హోలీ!
నకిరేకల్ అంటే వేముల వీరేశం… వేముల వీరేశం అంటే హోలీ!

హోలీ పండుగ అనగానే ఉత్తరాది రాష్ట్రాలు గుర్తుకు వచ్చే రోజులు పోయాయి…

ఇప్పుడు దేశం మొత్తం నకిరేకల్ వైపు చూస్తోంది. కారణం ఒక్కరే — ప్రజానాయకుడు వేముల వీరేశం..

నకిరేకల్ 3 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి విలువలను కాపాడే హోలీ పండుగను గత 20 సంవత్సరాలుగా నకిరేకల్‌లో కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా ప్రజల పండుగగా మార్చిన ఘనత వీరేశం గారిదే. యువతను, ప్రజాస్వామ్యవాదులను, ప్రతి కుటుంబాన్ని పేరుపేరునా ఆహ్వానిస్తూ హోలీని ఐక్యతకు ప్రతీకగా నిలబెట్టారు.

అనైతిక రాజకీయ కుట్రలతో ఒకసారి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినా… పడి లేచిన కెరటంలా తిరిగి ప్రజాభిమానం తుఫాన్‌గా మారి 50 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అత్యధిక మెజార్టీ సాధించిన వారిలో రెండో స్థానంలో నిలిచి తన ప్రజాదరణకు ముద్ర వేశారు. నకిరేకల్ ప్రజలు ఎవరి వెంట ఉన్నారో చరిత్రే చెబుతోంది.

ఈరోజు హోలీ సందర్భంగా.. ఎప్పటిలాగే తన మేనబావ నల్లబెల్లి యాదగిరి కి రంగులు చల్లి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఉత్సాహ తరంగం నకిరేకల్ ఇందిరాగాంధీ సెంటర్‌కు చేరుకునే సరికి ఇసుక వేస్తే రాలనంత జనసందోహంగా మారింది. నినాదాలు, రంగుల జల్లు, ఉత్సాహ కేకల మధ్య నకిరేకల్ మరోసారి తెలంగాణ రాజకీయ పటంలో ప్రత్యేక ముద్ర వేసుకుంది.

ప్రజల ప్రేమే తన బలం అని మరోసారి నిరూపించిన వీరేశం, సుఖశాంతులతో, సోదరభావంతో హోలీ సంబరాలు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333