చౌళ్ళరామారం మెయిన్ రహదారిపై అన్ని పార్టీలతో నిరసన కార్యక్రమం

Oct 19, 2025 - 01:10
Oct 19, 2025 - 01:12
 0  4
చౌళ్ళరామారం మెయిన్ రహదారిపై అన్ని పార్టీలతో నిరసన కార్యక్రమం

అడ్డగూడూరు18 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి అన్ని పార్టీల రాజకీయ నాయకులతో కలిసి రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకై బీసీ సంక్షేమ సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర బందులో భాగంగా నేటి బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి బందులో పాల్గొన్న అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి

బీసీ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిపిఎం నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని చౌళ్ళరామారం మెయిన్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి బందును విజయవంతం చేశారు.