ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి బీసీ హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతు

దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన ధనుంజయ నాయుడు
హుజూర్ నగర్ 15 మార్చ్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.:- తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.... గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న అలుపెరగని పోరాటానికి బీసీ హక్కుల సాధన సమితి తన సంపూర్ణ సహకారాన్ని సంఘీభావం తెలియజేస్తుందని, మాదిగల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని, ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బిసి ల 42% విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదముద్ర వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దశాబ్దాల తరబడి వివక్షత గురవుతున్న మాదిగలు మరియు బీసీలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, కామారెడ్డి లో ఇచ్చిన బిసి డిక్లరేషన్ లోని అన్ని హామీలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ దీక్షా శిబిరంలో చింతిరాల నాగయ్య మాదిగ, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు మాదిగ, ఎం జె ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒగ్గు విశాఖ, మందా వెంకటేశులు మాదిగ గుండె పొంగు బాబు మాదిగ మీసాల శరత్ మాదిగ రెడపంగ వెంకటేశ్వర్లు మాదిగ మంద రవీందర్ మాదిగ పల్లె క్రాంతి మాదిగ పాల్గొన్నారు