జిల్లా వైద్య ఆరోగ్యశాఖను సందర్శించిన స్టేట్ టీం అధికారులు
జోగులాంబ గద్వాల15 మే తెలంగాణవార్త ప్రతినిధ:- బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి యూనిసెఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మిస్ సిమ్రాన్ మరియు సౌజన్య, రవి నాయుడు తదితరులు వివిధ ఆరోగ్య కేంద్రాలు సందర్శించారు. అనీమీయ ముక్త్ భారత్ గురించి పలు సబ్ సెంటర్ లను సందర్శించారు..ముఖ్యంగా ఎనీమియా ముక్త్ భారత్ ప్రోగ్రాం సమీక్షించుటకు గాను జమ్మిచేడ్ మరియు ధరూరు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ఆరు నెలల నుండి 49 సంవత్సరముల వరకు వారిలో రక్తహీనత రాకుండగా ఐరన్ పోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఎలా వాడుతున్నారు, అనగా ఐఎఫ్ ఏ టాబ్లెట్లు మరియు సిరప్ లను మరియు నులుపురుగుల మాత్రలు ఆల్బం డజోల్ మాత్రలు ఎలా వాడుతున్నారు, అనే దిశగా ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎమ్ లను అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారికి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ శశికళ పూల బొకేతో ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ స్రవంతి, డాక్టర్ రాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏంజెల్, ఎం పి హెచ్ ఈ ఓ రవీందర్, సూపర్వైజర్ విజయ భాస్కర్, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్, మక్షుద్, ఏఎన్ఎం కవిత, శోభారాణి పాల్గొన్నారు.