రెడ్డి కమ్యూనిటీ హాల్ రద్దుచేసి పేదలకు  ఇళ్ల స్థలాలు కేటాయించాలి...

పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక

Mar 7, 2024 - 20:33
Mar 7, 2024 - 20:52
 0  2
రెడ్డి కమ్యూనిటీ హాల్ రద్దుచేసి పేదలకు  ఇళ్ల స్థలాలు కేటాయించాలి...

 సూర్యాపేట జిల్లా చివ్వెముల మండలం కుడకుడ గ్రామ శివారు సర్వేనెంబర్ 126 లో గల ప్రభుత్వ భూమిలో రెడ్డి కమ్యూనిటీ హాలుకు కేటాయించిన G.O ని రద్దుచేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పిఓడబ్ల్యు ఆధ్వర్యంలో  కుడ కుడ శివారు సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమి వద్ద రెడ్డి కమ్యూనిటీ హాల్ కేటాయించిన స్థలములో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ ఇదే సర్వే నెంబర్లో  2000 సంవత్సరం నుండి పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని మా పార్టీ ఆధ్వర్యంలో పేదలతో కలిసి అనేకమార్లు గుడిసెలు వేసి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలం కేటాయించాలని కలెక్టర్ గారికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారికి తెలియజేశi  కానీ పేదలకు ఇళ్ల స్థలాల కేటాయిస్తానని ఇచ్చిన  హాీమి మరిచిమాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ముందు పేదలు గుడిసెలు వేసిన స్థలాన్ని """ రెడ్డి కమ్యూనిటీ హాలు"""కు కేటాయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

   ప్రభుత్వం వెంటనే కల్పించుకొని రెడ్డి కమ్యూనిటీ హాల్ రద్దుచేసి తిరిగి పేదల స్థలాన్ని పేదలకు పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల కేటాయించాలని కోరారు జగదీశ్వర్ రెడ్డి చేసిన మోసాలను ప్రతి ఒక్కరు గమనించాలని అతను పావుకులను కొట్టి గద్దెలకు పెట్టినట్టు పేదలకు చెందాల్సిన భూమిని పెద్దలకు కట్ట పెట్టటం ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు జగదీశ్వర్ రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించి నిరుపేదలైనటువంటి ప్రజలు గుడిసెలు వేసుకుంటే వారి పైన మా పార్టీ నాయకుల పైన కేసులు పెట్టించి మమ్మల్ని మా కార్యకర్తలని అనేక ఇబ్బందులకు గురి చేశాడు అతని అనుచరులతో దాడులు చేయించాడు చివరికి ఎలక్షన్లప్పుడు అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ లో కేటాయిస్తానని హామీ ఇచ్చాడు.

   కానీ తాను ఇచ్చిన మాట తప్పి పేదల గుడిసెలు వేసుకున్న స్థలాన్ని"" రెడ్డి కమ్యూనిటీ "" హాలుకు కేటాయించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు దీనిపై జగదీశ్వర్ రెడ్డి స్పందించి పేద ప్రజలకు క్షమాపణ చెప్పి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరారు లేనియెడల మా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో తనని ప్రతి చోట అడ్డుకుంటామని తాను చేసిన అన్యాయాలను అక్రమాలని ఎండగడతామని తెలిపారు మా పోరాటానికి మేధావులు విద్యార్థులు మహిళలు యువకులు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గొడ్డలి నరసన్న ,లక్ష్మన్న పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక కోశాధికారి జయమ్మ కుడ్ కుడ గ్రామ కార్యదర్శి పద్మ పిఓఎల్ నాయకులు పరుశురాం ఐఎఫ్టియు జిల్లా నాయకులు వాజీద్ గౌరమ్మ, లక్ష్మి, అంజలి, రమణ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333