వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: వసతి గృహాలలో పారిశుద్ధ్యం తో పాటు వంట గది, స్టోర్ రూమ్ ల నిర్వహణ బాగుండాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి/మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గద్వాల మండలంలోని పుటాన్ పల్లి గ్రామంలో గల గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ఆయన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనకి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు వారికి మంచి ఆహారం, మెరుగైన ఆరోగ్యం, విద్య సౌకర్యం కల్పించేందుకు వసతి గృహాలలో మంచి సదుపాయాలు కల్పించాలన్నారు. వారి మానసిక అభివృద్ధికి డైట్, కాస్మోటిక్ చార్జీలను గతం కన్నా 40 శాతం ఎక్కువ పెంచడం జరిగింది తెలిపారు. వసతి గృహాల నిర్వాహకులు వారి పట్ల నిర్లక్ష్యం వహించకుండా మంచి భోజనంతో పాటు పరిసరాలను ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ తరగతి నుండి 7 తరగటీ వరకు
డైట్ ఛార్జీలు నెలకు ₹950 నుండి ₹1,330 కి పెంచడం జరిగిందని,
8 నుండి 10 తరగటీ వరకు
నెలకు ₹1,100 నుండి ₹1,540కి పెరిగాయన్నారు. అలాగే
ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులకు నెలకు ₹1,500 నుండి ₹2,100 కి పెంచడం జరిగిందని తెలిపారు.
అదనంగా, విద్యార్థులు సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూసేందుకు కాస్మెటిక్ ఛార్జీలను కూడా గణనీయంగా పెంచబడ్డాయన్నారు.