గ్రామం కోసం మానవత్వం చాటుకున్న నిమ్మల శ్రీనివాస్ గౌడ్

Oct 19, 2025 - 01:07
Oct 19, 2025 - 01:08
 0  8
గ్రామం కోసం మానవత్వం చాటుకున్న నిమ్మల శ్రీనివాస్ గౌడ్

అడ్డగూడూరు 18 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తండ్రి మల్లయ్య తన సొంత ఖర్చులతో 60 వేల రూపాయలు వెల్దేవి నుండి గోవిందపురం(కమ్మ గూడెం)పొలిమేర వరకు రోడ్డు కు మొరంపొసి మానవత్వం చాటుకున్నారు.గత రెండు నెలల నుండి అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిన దారిని చూసిన కొంతమంది వ్యక్తులు వారికి సమాచారం అందించగా ప్రజాసేవకే నేనున్నానంటూ.. ముందుకొచ్చిన నిమ్మల శ్రీనివాస్ గౌడ్..గ్రామస్తులు రైతులు పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోయారు.ఇంతకు ముందు రైతులు,వ్యవసాయ కూలీలు అటుగా వెళ్లాలంటేనే వెళ్లి పరిస్థితి లేకుండే..వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వడ్ల మార్కెట్ కు ట్రాక్టర్ యజమానులు గుంతలు,మడుగులు,బురద మాయంతో ఉన్న రోడ్డు దారిని చూసి ప్రజలకు భయమేసేదని గుర్తు చేశారు.ఎన్ని ఊర్లు మారిన మా ఊరు ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు.నిత్యం కూలీలు వ్యవసాయ పనుల కొరకు వస్తు పోతుంటారని అన్నారు.గ్రామస్తులు, వాహనదారులు వెల్దేవి గ్రామం నుండి ఏ మండలానికి పోదామన్నా రోడ్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు.వెల్దేవి నుండి మానాయకుంట,వెల్దేవి నుండి అజింపేట వరకు ఎటు చూసినా రోడ్లతో ఇబ్బందిగా ఉంటుందని గ్రామస్తులు తెలియజేశారు.ఈ సందర్భంగా 60రు"దాత నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...ఉన్న ఊరు కన్నతల్లి అనే నినాదం..దృష్టిలో పెట్టుకొని మన ఊరికి ఏదో ఒకటి మంచి పని చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చానని అన్నారు.రైతులు,వ్యవసాయ కూలీలు,అటుగా వెళ్లే వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురికోవద్దని దృష్టితో 20 ట్రిప్పుల మట్టి మొరం పోపియడం సదును చేయడం జరిగిందని అన్నారు.మొరం దాత నిమ్మల శ్రీనివాస్ గౌడ్ కి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు,మహిళలు,కూలీలు,ట్రాక్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.