మైనర్లకు మోటార్ సైకిల్ ఇచ్చే పేరెంట్స్ ప్రోత్సహించవద్దు""సీఐపి వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : మైనర్లకు మోటర్ సైకిల్ ఇచ్చి పేరెంట్స్ ప్రోత్సహించ వద్దు - సిఐ పి.వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు జగ్గయ్యపేట పట్టణంలో యన్.టి.ఆర్ సర్కిల్ వద్ద వాహనాల ను సిఐ పి వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు మరియు సిబ్బంది తో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేయగా వారిలో అధిక శాతం మైనర్లను గుర్తించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐ పి వెంకటేశ్వర్లు మైనర్ల యొక్క తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లను తీసుకొని వారితో ఖరీదైన మోటర్ వాహనాలను మైనర్లకిచ్చి నడపటానికి ప్రోత్సహించ వద్దని, ప్రమాదవశాత్తు వారికి కాని,వారి వల్ల ఇతరులకు గాని ఏమైన జరిగితే వారి యొక్క బంగారు భవిష్యత్తు పాడౌతుందని,కాబట్టి ఇలాంటి పొరపాటు మరో మారు చేయవద్దని,పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని వారి తల్లిదండ్రులను ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు ట్రాఫిక్ యస్.ఐ శ్రీనివాసరావు, టౌన్ యస్.ఐ జి రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.