ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
కోదాడ 9: జోనల్ ఇన్చార్జి స్నేహలత ఆధ్వర్యంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. స్నేహలత మాట్లాడుతూ పండగంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సుఖసంతోషాలతో ఉండటమే అని అన్నారు. మా విద్యార్థులు అన్ని రంగాలలో ముందు స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ముగ్గులలో రంగుల మాదిరిగానే జీవితం రంగుల మాయం కావాలని కోరుకున్నారు. విద్యార్థులకు అన్ని విషయాలలో అవగాహన తెలియజేయడమే మా పాఠశాల యొక్క ప్రాముఖ్యత అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ ఈ సంక్రాంతి కి పాతదనం పోయి కొత్తదనంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. భోగి మంటలను నిర్వహించి ఆటపాటలతో విద్యార్థులు అందరూ ఆనందించారు. గాలిపటాల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.