మహాసభలకు అందరూ హాజరు కావాలి!రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఉపేందర్

Oct 23, 2024 - 19:48
 0  5
మహాసభలకు అందరూ హాజరు కావాలి!రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఉపేందర్
మహాసభలకు అందరూ హాజరు కావాలి!రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఉపేందర్

రామన్నపేట 23 అక్టోబర్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:-  రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా జెండా ఆవిష్కరణ రామన్నపేట పట్టణ కేంద్రంలో  సి.ఐ.టి.యు కార్యాలయంలో మరియు కుమ్మాయిగూడెం గ్రామంలో NPRD జండా ఎగిరేయడం జరిగింది.
బుదవారం రామన్నపేట కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో  గుమ్మాయిగూడెం గ్రామంలో
NPRD తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జెండా ఎగరేయడం జరిగింది. 
 అనంతరం ఆయన మాట్లాడుతూఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న NPRD రాష్ట్ర మహాసభలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయని తెలిపారు.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టన్ని సాధించడంలో NPRD పాత్ర చాలా ఉందని అన్నారు. దేశ వ్యాప్తంగా వికలాంగుల హక్కుల సాధన కోసం, చట్టాల అమలు కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందనిఅన్నారు.వికలాంగులపై జరుగుతున్న దాడులు,వివక్షత వంటి అంశాలపై ఉద్యమలు చేస్తుందని అన్నారు.విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని నిరంత అక్టోబర్ 25-26తేదీల్లో NPRD రాష్ట్ర 4వ మహాసభలు జిల్లా వ్యాప్తంగా విజయవంతం విజయవంతంగా జయప్రదం చేయాలని అన్నారు.
వికలాంగుల హక్కుల సాధనలో NPRD చేస్తున్న పోరాటాలు అనేకమని అన్నారు. సామూహిక ప్రాంతాల్లో ర్యాంపూలు నిర్మించాలని ఐక్య పోరాటాలు చేస్తుందని తెలిపారు.అక్టోబర్ 25-26 తేదీల్లో హైదరాబాద్ నగరంలో NPRD రాష్ట్ర 4వ మహాసభలకు జిల్లా నుండి అనేకమంది వికలాంగులు హాజరై విజయవంతం చెయ్యాలని వారు పిలుపునివ్వడం జరిగింది.ఈ మహాసభల ప్రారంభ సభకు ముఖ్య  అతిథిగా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి డి సీతక్క,TVCC చైర్మన్ ముత్తినేని వీరయ్య, NPRD జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నంభు రాజన్ హాజరు అవుతున్నారని తెలిపారు.మహాసభల ప్రారంభ సభ సందర్బంగా వికలాంగుల కళాకారులతో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.మహాసభలకు 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారనిఅన్నారు.మహాసభల్లో నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్స్ అమలు, పెన్షన్ పెంపు, స్వయం ఉపాధి, చట్టాల అమలు,ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
మహాసభల్లో రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామనితెలిపారు.మహాసభల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొమ్మాయిగూడెం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది కొమ్మాయిగూడెం గ్రామ అధ్యక్షులు శ్రీపాద అంజయ్య చారి కార్యదర్శి రేపాక రమేష్ కోశాధికారి కంచి హరీష్ ఉపాధ్యక్షులు శ్యామల ప్రేమలత సహాయక కార్యదర్శి ఉపేందర్
 ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల కార్యదర్శి గిరికల లింగస్వామి పల్సం పరశురాములు జిలకల  లావణ్య 
 కే వెంకటేశం, సత్యం, అంజయ్య, ఉపేందర్,ఎండి జావిద్ సోయల్, రామన్నపేట కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333