టీచర్ ఎమ్మెల్సీ గా పి ఆర్ టి యు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి

Oct 17, 2024 - 19:49
Oct 17, 2024 - 20:29
 0  0
టీచర్ ఎమ్మెల్సీ గా పి ఆర్ టి యు అభ్యర్థి  శ్రీపాల్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- టీచర్ ఎమ్మెల్సీ గా పి ఆర్ టి యు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించండి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: జితేందర్ రెడ్డి, నరేష్ . శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ పి ఆర్ టి యు టి ఎస్ అధికార అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని సూర్యాపేట జిల్లా, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, తీగల నరేష్ కోరారు. గురువారం ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని వివిధ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఫారాలు పంపిణీ చేసి సంఘం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీపాల్ రెడ్డి పని చేసిన సమయంలో ఉపాధ్యాయులకు 30 శాతం పిఆర్సి ఇప్పించడం, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరములకు పెంచడం శ్రీపాల్ రెడ్డి కృషి మేరకే సాధ్యమైందని అన్నారు. పదోన్నతులు బదిలీలు వేలాది సంఖ్యలో ఇప్పించడంలో పిఆర్టియు పాత్ర మరువలేనిదన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏలు అదే విధంగా, ఇతర పెండింగ్ బకాయిలు విడుదల కొరకై తమ సంఘం ఆధ్వర్యంలో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు .రాబోయే కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మరిన్ని జీవోలు ఇప్పించేందుకు సంఘం కట్టుబడి ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ మాజీ అధ్యక్షులు జ్యోతుల చంద్రశేఖర్ ,మాజీ జిల్లా గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గుగులోతు తావూరియా నాయక్ , పిన్నమరెడ్డి నరేందర్ రెడ్డి ,గోదేశి దయాకర్ , కొల్లు సత్యనారాయణ రెడ్డి , K సుదర్శన్ రెడ్డి గారు, గంజి శంకర్ , గుణగంటి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.వీరారెడ్డి తొగరు రామయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షలు ఎలక శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోపిరెడ్డి, కొరదల రాములు, గురవయ్య, రమేష్ నాయక్, గుణగంటి సురేందర్, జిల్లా కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, లింగయ్య, సురేందర్ ,వైఎస్ఆర్ , ఆత్మకూర్ ఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తంగెళ్ళ వాసుదేవ రెడ్డి, నంద్యాల చౌదరి రెడ్డి మండల అసోసియేట్ అధ్యక్షులు జగన్, వెంకన్న మండల బాధ్యులు ఉపేందర్ రావు మాధవ రెడ్డి సీనియర్ నాయకులు అన్నపూర్ణ చారి సూర్యాపేట రూరల్ అనంతగిరి, మఠంపల్లి, చివ్వెంల మండల శాఖల అధ్యక్షులు వల్లెం శంకర్ ప్రసాద్ , జహీర్ ఖాన్ గారు ఎర్ర కృష్ణారెడ్డి , కందరబోయిన లింగరావు తదితరులు పాల్గొన్నారు.